తెల్లజుట్టు నివారణ..నల్లగా..ఒత్తుగా..పెంచే చిట్కాలు...
Friday, December 16, 2011, 14:58 [IST]
How to reduce white hair in Young Age...!
కొంత మందికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడు తుంది. దీనిక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వంశపారంపర్య లక్షణాల మూలంగా కూడా జుట్టు తెల్ల బడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆహారలోపాలు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం. ఇక నేటి వాతావారణ కాలుష్యం కూడా దీనికి ఓ కారణం. తీసుకునే ఆహారంలో లోపాలు, థైరాయిడ్‌ సమస్య, మా నసిక ఒత్తిడి, ఆందోళన, రకరకాల షాంపూలు వాడడం వంటివి పలు కారణాలు కావచ్చు.

ఇక తీసుకునే ఆహారంలో లోపాలు కూడా తెల్లజుట్టు రావడానికి కారణమవుతాయి. ప్రతిరోజూ మంచి పోష కాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, మొలకెత్తిన విత్త నాలు, సోయాజాతి విత్తనాలు, డ్రైప్రూట్స్‌ వంటివి ఎక్కు వగా తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఘూటైన షాంపూలను వాడరాదు. ఎప్పు డు ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మార్కెట్లోకి కొత్తగా ఏవీ వస్తే వాటిని వాడడం సరికాదు. గుడ్డు తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్టుల్ని తలకు ప్యాక్‌ గా వేసుకోవాలి. మందారాకు పేస్ట్‌ తో కూడా ప్యాక్‌ చేసుకోవచ్చు.హెర్బల్‌ హెన్నాలో బీట్‌ రూట్‌ రసాన్ని కలిపి ప్యాక్‌ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.

ఉసిరి, వేప ఆకుల్ని విడివిడిగా తీసుకుని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. తరువాత ఉసిరి, వేప, పసుపు మూడింటింని సమభాగాలుగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని రొజూ రెండుసార్లు ఓ టీస్పూన్ మోతాదులో నీళ్ళల్లో కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే జుట్టు తెల్లబడడం క్రమంగా తగ్గుతుంది.

కొబ్బరి నూనెలో ఉల్లిపాయముక్కలు వేసి మరిగించాలి. ఈ నూనెను తలకు మర్దన చేసుకోవాలి. తరువాత అన్నం వార్చిన గంజితో తల రుద్దుకుంటే చుండ్రు పోతుంది, జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొబ్బరినూనె సమానంగా తీసుకుని బాగా కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. తరువాత వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ ను తలకు చుట్టుకుని ఉంచి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.
Also read
» పెళ్లి కాకుముందే తెల్ల వెంట్రుకులా...?
» బట్టతల పై వెంట్రుకులు మొలవాలంటే..?
» మన్నికైన షాంపూ మీ జుట్టును కాపాడగలదా..?
» సిటీలో ఉంటున్నారా జుట్టు జర భద్రం..?