జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే?
Tuesday, October 11, 2011, 15:59 [IST]
How to Stop Grey Hair!
ముప్పై అయిదు సంవత్సరాల వయసు వచ్చేసరికి పురుషులైనా, స్త్రీలైనా జుట్టు తెల్లబడటం సర్వసాధారణం. అంతకు ముందే జుట్టు తెల్లబడుతూ వుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, జంక్ ఫుడ్ లు, వేపుళ్ళు, మసాలాలు తినడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జుట్టు తెల్లపడటాన్ని నివారించగలుగుతాం.

-ఒక స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలుపుకొని ప్రతి రోజు తలకి మర్దన చేయండి.
-మల్లెచెట్టు వేళ్ళు, నిమ్మరసంతో కలిపి మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత కడిగేయాలి.
-తలంటు స్నానం చేసేటపుడు వీలైనంత వరకు సహజ క్లీనింగ్ మెటీరియల్ అయిన కుంకుడు, శీకాయ, హెర్బల్ షాంపూలనే వాడాలి.
-జుట్టుకు తరచూ నూనెతో మర్దన చేయడం చాలా మంచిది.
-వారానికి రెండు లేదా మూడుసార్లు ఆవనూనె కానీ, లేదా కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.
-తలస్నానం తర్వాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలంతా మసాజ్ చేస్తే కుదుళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
- కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది.
-తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపు వస్తుంది.
Also read
» వేడి అన్నంలో చల్లటి కూర కలుపుకుతింటే..?
» మీకు చుండ్రుందో లేదో తెలుసుకోవాలంటే..?
» అందాల ఆరబోతకే మోడ్రెన్ భామలు మొగ్గు..!!
» ఇక ‘హుక్స్’తో పనిలేదు..!!