
మనం రోజూ వాడుకునే నూనెలను కూడా సౌందర్య సాధనాలుగా వాడుకోవచ్చు. అరోమా, సుగంధ నూనెలతోపాటు, మేని సౌందర్యాన్ని పెంచడానికి నూనెలు ఎంతగానే దోహదంచేస్తాయి. చర్మం నిగారింపు తగ్గ కుండా, మృదుత్వాన్ని కోల్పోకుండా నూనెలు ఉపయోగపడతాయి.
కొబ్బరి నూనె: స్వచ్ఛమైన కొబ్బరి నూనెను శిరోజాల సౌందర్యానికి వాడతారు. కొబ్బరి నూనె వెంట్రుకలను మృదువుగా, నల్లగా చేస్తుంది. కేశాల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడటమే కాక చర్మాన్ని నల్లగా ఉంచుతుంది. శీతాకాలంలో చర్మం పగలకుండా రక్షణగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కొన్ని సౌందర్య సాధనాలలోనూ, క్రీములు, బేబీ ఆయిల్స్ షాంపుల తయారీలోనూ వాడుతున్నారు. కాలిన గాయాలపై కొబ్బరి నూనె రాస్తుంటే మచ్చ ఏర్పడకుండా ఉంటుంది.
ఆల్మండ్ ఆయిల్: సూర్య కిరణాలను తట్టుకునే శక్తి ఈ నూనెలో ఉంది. ఇది చర్మ రక్షణగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, ఫాస్పరస్, కాల్షియం, సల్ఫర్, క్లోరిన్, మాగ్నీషియం అధికంగా లభిస్తాయి. ఈ కారణంగా ఆల్మండ్ ఆయిల్‌ను సౌందర్య సాధనాల తయారీలో ఈ నూనెను ఉప యోగిస్తారు. ఈ నూనె కోల్డ్ క్రీమ్స్, బాడీ లోషన్లు, హాండ్‌క్రీమ్స్, కొన్ని రకాలైన సబ్బులలోనూ ఉంటుంది.
ఆలివ్‌నూనె: చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధన చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్ తయారీ లోనూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది.
ఆముదం నూనె: ఈ నూనెను చర్మానికి పైపూతగా ఉపయోగి స్తారు. చర్మంపై ఏర్పడే పులి పిరులు, చెమట పొక్కులు, పాదాలకు ఏర్పడే అనెలకు లోతైన గాయాల తాలూకు మచ్చలను పోగొట్టడానికి కాస్ట్రా యిల్ దివ్యౌషధంగా పని చేస్తుంది. శిరోజాల ఆరోగ్యానికి రక్షణగా పనిచేస్తుంది. కనుబొమల వెంట్రుకలు పెరగడానికి కనురెప్పల సౌందర్యానికి ప్రతిరోజూ నూనెను రాయడం మంచిది. కేశాలు నల్లగా నిగనిగలాడటానికి తోడ్పడుతుంది.
యూకలిప్టస్ నూనె: ఈ ఆయిల్ చర్మానికి ఔషధంగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన అనారోగ్యాలను పోగొడుతుంది. తలనొప్పిని, బెణుకు నొప్పులను యూకలిప్టస్ ఆయిల్‌ను పూయడం వల్ల ఆ బాధను తగ్గిస్తుంది.
Also read
» డాండ్రఫ్ (చుండ్రు)భారీ నుండి బయట పడటం ఎలా» ‘బీర్’లో అంత దమ్ముందా..?
» జట్టు రాలిపోతుందా..?
» నూనె రాసుకోపోతే ‘బట్టతలే’..?
