పార్టీలో అందరూ మిమ్మల్నే చూడాలంటే...
Tuesday, February 21, 2012, 17:32 [IST]
Elegant Party Hair Style
పార్టీలు, ఫంక్షన్ అనగా సాధరణంగా యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో ఎలా తయారవ్వాలి..ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి.. ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలో తెలియక..టైం కుదరక బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే అలా చేయడం వల్ల ఆ మేకప్ కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. పార్టీలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. పార్టీలకు అందమైన డ్రెస్ వేసుకొని..డ్రెస్ కు తగ్గ హెయిర్ స్టైల్ తో ముగ్థమనోహరంగా తయారవ్వాలంటే ఇంట్లోనే బ్యూటీ పార్లర్ల బ్యూటీ టిప్స్ ఏంటో చూద్దాం....

1. వేసుకొన్న డ్రెస్ ను బట్టి మీ జుట్టు షేప్ ఎలా ఉన్నా దువ్వుకునేటప్పుడు బ్రష్ లేదా దువ్వెనను గుండ్రంగా తిప్పి జుట్టును ముడివేస్తే ఒత్తైన రింగుల జుట్టుతో పార్టీలో ఆకర్శితులవుతారు.
2. జుట్టు పొడవుగా ఉంటే మీడియం సైజు బ్రష్ వాడాలి. చిన్న జుట్టు ఉన్నవారు చిన్న బ్రష్ ను వాడాలి. ఇలా అవసరమైన దువ్వెనతో దువ్వితే జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.
3. అదే రింగురింగుల జుట్టు ఒత్తుగా ఉండాలనుకుంటే బ్లో డ్రై చేసుకునేటప్పుడు తలను కిందకు వంచి జుట్టుకుదుళ్ల వరకు దువ్వుకుని, బ్లో డ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే కురులు రింగులుగా ఒత్తుగా కనిపిస్తాయి..
4. జుట్టు కింది భాగాన్ని నిటారుగా చేయాలనుకుంటే డ్రయ్యర్ ను కూల్ సెట్టింగ్ లో పెట్టి జుట్టును డ్రై చేయాలి.
5. జుట్టు మెరవాలంటే ఏదైనా మంచి కంపెనీ తయారు చేసిన నాణ్యమైన నూనెతో తలపై మసాజ్ చేయాలి. తర్వాత ప్లాస్టిక్ షవర్ క్యాప్ తలకు పెట్టుకుని వేడినీళ్ళలో టవల్ ను ముంచి తలపై పెట్టుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా..మెరుస్తూ కనిపిస్తుంది...

Also read
» కేశ సంపదను వృద్దిచేయండిలా...
» వాలెంటైన్ డే కి రొమాంటిక్ హెయిర్ స్టైల్....
» అందంలో కేశాల ప్రాధాన్యత...జాగ్రత్తలు
» దువ్వెనెల ఎంపికలోనే మీ జుట్టు అందమంతా...!