Monday, January 16, 2012, 17:16 [IST]
బట్టతల తిరిగి వెంట్రుకలతో కళకళ లాడాలంటే ...

బట్టతలతో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. అధిక శాతం యువత వెంట్రుకలు రాలడం మొదలైతే చాలు.. బట్టతల వస్తుందేమోనని బెంబేలెత్తిపోతుంటారు. చుండ్రు, హార్మోన్లు, వంశ పారంపర్యతలాంటి రకరకాల కారణాలను ఊహించుకుని ఆందోళనచెందుతుంటారు. అయితే తలపై చర్మంలో ఉండే మూలకణాలు క్షీణించడం వల్లే పురుషులకు బట్టతల వస్తోంది. అతి వేడి కారణంగా వెంట్రుకలకు కావాల్సిన కొవ్వు పదార్థం అందక రాలిపోతుంటాయి. ఇందుకు విరుగు అప్పుడే ఆరంభించాలి. పూర్తిగా బోడి అయిన తరువాత ప్రయత్నం చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే ముందుగా జాగ్రత్త తీసుకోవాలి.
1. లక్క, శుద్ధిచేసిన నాభి, అతి మధురం, చింతాకు, నల్లికాయ రసం, నీలి ఆకులు మెత్తగా నూరి మంచినూనె పోసి బాగా ఉడకపెట్టాలి. వడపోయాలి రాత్రులందు లేపనం చేయాలి.
2. నూరిన మెంతులతో తలకు పట్టించాలి. తెల్లవారి స్నానం చేయాలి.
3. జింకు, సిలికా, మినరల్స్ ఉన్న పదార్థాలు కేశసంపదకు దోహదపడుతాయి.
4. దేవదారు చెక్క నుండి తీసిన తైలం బట్టతలపై మర్ధనా చేయడం వలన కొత్తగా కేశాలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రకాల నూనెలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. అయితే వెంట్రుకలు లేని చోట మాత్రమే మర్ధనా చేయాలి.
5. హెర్బల్ వైద్యంతోపాటు అకుపంక్షర్ విధానాన్ని అవలంభించడం వలన కొత్త జుత్తు వచ్చే అవకాశం చాలా బాగా ఉంది.
6.జుట్టు మొలిచేవరకు పట్టు వదలకుండా బట్టతలపై పుట్టతేనె మర్దించండి.
7. ముల్లంగితో బట్టతల ప్రాంతంలో తరచూ మర్థన చేస్తుండాలి. అప్పుడప్పుడు మధ్యమద్యలో రెడ్ ఆనియన్ జ్యూస్ తో కూడా మర్దన చేయవచ్చు.
» జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే?
» జుట్టుకు నూనె రాయడం మంచిదేనా..?
» రోజు తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా..?

Also read
» ఆరోగ్యవంతమైన వెంట్రుకుల కోసం..ఐదు బెస్ట్ హెయిర్ ఆయిల్స్..» జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే?