కేశాలు నల్లగా ఒత్తుగా పెరగాలంటే...
Saturday, January 14, 2012, 16:02 [IST]
Tips for Thick Black hair Care
ప్రస్తుతం ఎన్ని రకాల హెయిర్‌ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. సహజంగా ఉంటే జుట్టు ఎర్రబారుతుందని అనిపించినప్పుడు ఈ చిట్కా ప్రయోగిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.

1. ఎర్రగా ఉండే కురులు నల్లగా మారాలంటే ఉసిరి కాయ పేస్టు, గోరింటాకు పొడి, మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్ లెక్కన సమానంగా తీసుకుని వీటికి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను చేర్చి షాంపూ వలే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎర్రగాఉన్న కురులకు పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. వారాని ఒక సారి ఇలా చేస్తూ వస్తే చాలు. రెండు మాసాల్లో మీ కురులు నల్లగా నిగనిగలాడుతాయి.

2. అలాగే కొబ్బరినీళ్లు, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని తలకు బాగా పట్టించి పదిహేను నిమిషాల పాటు నడినెత్తిన మసాజ్‌ చేయండి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు పొరవిప్పిన నల్లతారులా నిగనిగలాడుతుంది. ప్రయత్నించి చూడండి.

3. త్రిఫల చూర్ణాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి రాత్రంతా ఉంచేయండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా వేడి చేసి చల్లారిన తరువాత తాగండి.
Also read
» తెల్లజుట్టు నివారణ..నల్లగా..ఒత్తుగా..పెంచే చిట్కాలు...
» దువ్వెనను శుభ్రంచేయ్యకపోతే...?
» ‘డేంజర్’.. జుట్టు తెల్ల బడటానికి కారణాలు..!!
» మన్నికైన షాంపూ మీ జుట్టును కాపాడగలదా..?