యాంటీ ఆక్సిడెంట్లు ఎందుకు వాడాలి?
Wednesday, February 22, 2012, 11:21 [IST]
How Antioxidants Work?
యాంటీ ఆక్సిడెంట్లు అంటే....విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్స్ మొదలైనవి. ఇవి మనలో గుండెపోటు, కేన్సర్, పక్షవాతం, కేటరాక్ట్, కీళ్ళనొప్పులు, అల్జీమర్ వ్యాధి మొదలైన వ్యాధులనరికడతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎందుకు కావాలి? మనలో ఒత్తిడి ఏర్పడినపుడు కొన్ని కణాలు నష్టమైపోతాయి. అటువంటపుడు వాటిని మరల భర్తీచేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమవుతూంటాయి. లేదంటే మృతకణాలు అధికమై శరీరంలోని కణాలపై తమ ప్రభావం చూపుతాయి. దీనినే ఆక్సిడేషన్ ప్రక్రియ లేదా దగ్ధ ప్రక్రియ అంటారు. నూనెలు నల్లపడి వాసనరావటం,

ఆపిల్ తొక్క తీసి వుంచితే అది నల్లబడిపోవటం, ఇనుము తప్పు పట్టడం వంటివి దీనికిందే వస్తాయి. జీవులలో మెటబాలిక్ ప్రాసెస్ లేదా జీవక్రియ, మొదలైనవి కూడా ఆక్సిడేషన్ గా పేర్కొనవచ్చు. దీనికి సహకరించేది, కాలుష్యం, వ్యాయామంలో అలసట, స్మాకింగ్, ఆల్కహాల్ తాగటం వంటివిగా వుంటాయి. అపుడు ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ని శరీరంలోని కణాలతో సమతుల్యత చేయటానికిగాను యాంటీ ఆక్సిడెంట్లు వుండే పదార్ధాలు తినాలి.
Also read
» అన్నం తింటే...బరువెక్కుతారా?
» ఆరోగ్యకరమైన ఆహారాలు!
»  అద్భుత ఫలితాలనిచ్చే నిమ్మరసం!
» జంటగా కలిసి వ్యాయామం చేస్తే... !