బరువు తగ్గాలంటే మెటబాలిజం ఎలా వుండాలి?
Wednesday, February 22, 2012, 10:38 [IST]
Things you must Know about Metabolism
బరువు తగ్గాలంటే మీ మెటబాలిజం రేటు అధికంగా వుండాలి. అపుడే కేలరీలు బాగా ఖర్చవుతాయి. మరి మీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా మెటబాలిజం ప్రక్రియ గూర్చి కొన్ని అంశాలు పరిశీలించండి. మెటబాలిజం ప్రక్రియను పూర్తిగా మార్చలేమని గుర్తించండి. అయితే, కేలరీలు తీసుకోవడం, శారీరక శ్రమ అధికం చేయడం ద్వారా దానిని మార్చవచ్చు. మీ కేలరీలు పూర్తిగా తగ్గించడం బరువు తగ్గడానికి సహకరించదు. బరువు తగ్గాలంటే ఆరోగ్యకర ఆహారాలు ఒక పద్ధతిలో తినాలి. చురుకైన రీతిలో మీ జీవన విధానం వుండాలి. అందుకు సహకరించేందుకు ఒక మాదిరి నుండి అధికమైన శారీరక వ్యాయామం చేయాలి. వేగవంతమైన నడక, జాగింగ్ మొదలైనవి మీ డైలీ రొటీన్ లో భాగంగా వుండాలి.

మెటబాలిజం పెంచాలంటే, బరువులెత్తడం, కండలు ఏర్పరచుకోడం మంచి వ్యాయామం. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే 6 నుండి 8 గంటల పూర్తి నిద్ర ప్రతిరోజూ అవసరం. నిద్ర అంతకు తగ్గితే, శరీరంలోని బ్లడ్ షుగర్ నియంత్రించబడదు. నిద్రలేక వచ్చే ఒత్తిడి మీ లావుకు తోడవుతుంది. వయసు అధికమయ్యే కొద్ది మీ జీవప్రక్రియ తగ్గుతుంది. ధైరాయిడ్ సరిగా పని చేయకున్నా మీ మెటబాలిజం తగ్గుతుంది. కనుక ధైరాయిడ్ పరీక్షచేయించుకోవాలి.

కేఫైన్ వాడకం మెటబాలిజం పెంచినప్పటికి మీ కేంద్ర నరాల వ్యవస్ధను దెబ్బతీస్తుందని గుర్తించండి. కేలరీలు లెక్కించేకంటే, తీసుకునే కేలరీలు, మీ శారీరక శ్రమల మధ్య సమన్వయం చేకూర్చండి.
Also read
» గాఢ నిద్ర పొందటమెలా?
» వెల్ నెస్ ఇండియా ఎక్స్ పో 2012
» ఆరోగ్యకరమైన ఆల్కహాల్ డ్రింకులు!
» నోటిలో పుండ్లకు కారణాలు, నివారణ!
»  బ్లడ్ కౌంట్ పెంచే ఆహారాలు!