పచ్చని మొక్కలను అభిలషించే నేటి యువత
Tuesday, February 21, 2012, 16:51 [IST]
Green Gardening
ప్రస్తుత జనరేషన్ లో యువతలో ప్రకృతి పట్ల ప్రేమ వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, ముంబయ్‌, బెంగళూర్‌ వంటి నగరాల్లో యువతీ యువకులు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం కోసం పాటుపడుతున్నారు. యువత డిమాండ్‌ వల్ల పట్టణాలల్లోని నర్సరీలు రకరకాల మొక్కలతో కొలువుతీరుతున్నాయి. పూల కోసం, ఇంటి ముందు అలంకరణ కోసం మొక్కలను పెంచు కోవాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో నర్సరీలకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది.ముఖ్యంగా పూల మొక్కలను పెంచేందుకు యువత చాలా ఆసక్తి కనబరుస్తోంది. కొత్త రకం పూలు, అరుదైన మొక్కలను కొనుగోలు చేయడానికి వారు ముందుకువస్తున్నారు.

పట్టణాలల్లోని యువ ఇంటి అలంకరణలో ఎప్పుడూ ముందుంటారు. ఇంటిలోపల కానీ ఇంటి బయట కాని పూల మొక్కలను పెంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మనుషులు ఫ్రెండ్ షిప్ కంటే మొక్కలను ఫ్రెండ్ షిప్పే బెస్ట్ అంటున్నారు. మొక్కలు సుగంద పరిమళాలను, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కురిపిస్తాయి కాబట్టి వాటిమీదే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కొంతమంది ఇంటిముందు విరబూసిన పువ్వులను చూస్తే మంచి జరుగుతుందని భావిస్తున్నారు.

మొక్కల ఎంపిక విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు వేరు వేరుగా ఉం టారు. అమ్మాయిలు ఎక్కువగా పూల మొక్కలను పెంచడానికి ఇష్టపడు తుంటారు. ఇక అబ్బాయిలైతే అరుదైన మొక్కలు, కుండీలలో పెంచే క్రోటన్‌ మొక్కలను చాలా ఆసక్తిగా కొనుగోలు చేస్తుంటారు. చాలామంది కుర్రకారు ఎక్కడా సాధారణంగా దొరకని అరుదైన మొక్కలను పెంచడానికి ఇష్టపడుతుంటారు. వీటికోసం అనేక ప్రదేశాలు తిరిగి మరీ సేకరిస్తుంటారు. అలాగా కొత్తరకం పూల మొక్కలను కూడా పెంచుకోవడానికి ఎనలేని ఆసక్తిని కనబరుస్తుంటారు.

మొక్కలను పెంచుకోవాలనే ఆసక్తి తో మొక్కలను ఎంచుకొనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు పెంచుకోవాలనుకొనే మొక్కలు ఏప్రదేశంలో పెంచాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ చేసుకొని వాటికి తగ్గ వాటినే ఎంచుకోవాలి. కొత్త మొక్కలను పెంచేటప్పుడు వాటి వివరాలను ముందుగానే అమ్మకందారుని వద్ద పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. పెరడులో, కుండీలలో పెంచడానికి వేరువేరుగా ప్రత్యేకమైనవి దొరుకుతాయి. అలంకరణ కోసం కుండీలలో పెంచే సైకస్‌, ట్యుటోనియా, క్యాక్టస్‌, కోలెస్‌, మనీప్లాంట్‌, ఎడీనియం, ఆర్కిడ్స్‌, బ్యాంబుక్‌ రాజ్‌ తదితర జాతుల మొక్కలను ఎంచుకుంటే మంచిది.
Also read
» ఇండోర్ ప్లాంట్స్ తో ఇల్లంతా గో గ్రీన్...
» మొదటి సారి మొక్కలను పెంచుకోవాలనుకుంటున్నారా..?
» ఇంటి సేద్యం/గార్డెనింగ్ కి అవగాహన ముఖ్యం....
» ప్రేయసి ఇచ్చే గులాబీతో స్వప్నలోకంలో విహరించండి...