పిల్లలు అన్ని విధాలా ఎదగాలంటే....!
Wednesday, February 22, 2012, 12:58 [IST]
all round growth of children!
పిల్లలు మానసికంగా, శారీరకంగా పెరుగుదల చూపాలంటే వారికి ఆరోగ్యకరమైన సంతులిత ఆహారం అందించాలి. ఈ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్లు, మినరల్స్, పీచు అన్నీ కూడా తగిన మోతాదులో వుండాలి. ఈ పోషకాలలో ప్రతి ఒకటి బిడ్డ ఎదుగుదలకు ప్రధానమే. ఈ పోషకాలు ఏ రకమైన పాత్ర వహిస్తాయనేది పరిశీలించండి.

- కార్బో హైడ్రేట్లు తక్షణ శక్తినిచ్చి బిడ్డ చురుకుగా వుండేలా చేస్తాయి.
- ప్రొటీన్లు బిడ్డ ఎదుగుదల, రిపేరు కు తోడ్పడి అన్ని విధాలా పెరుగుదలనిస్తాయి.
- కొవ్వులు - ఇవి కూడా బిడ్డకు శక్తినిచ్చి ఎదుగుదలకు తోడ్పడతాయి.
- విటమిన్లు చాలా కొద్ది పరిమాణంలో తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా వుంటుంది.
- మినరల్స్ ఆరోగ్యకర దంతాలు, ఎముకలు, కండలు నిర్మిస్తాయి. కనుక పది సంవత్సరాలు వచ్చేటప్పటికి వీటి ఫలితం బాగా కనపడుతుంది.
- పీచు పదార్ధాలు జీర్ణ ప్రక్రియకు సహకరించి పేగులు బాగా పనిచేసేలా చూస్తాయి. జీర్ణం కాని పీచు విరేచనం సుఖంగా అయ్యేలా చేస్తుంది.

సంతులిత ఆహారం అంటే పైన చెప్పిన పోషకాలు తగిన పాళ్ళలో వుండాలి. అపుడే పిల్లలు అన్ని రకాలుగా అభివృధ్ధి చూపగలరు.
Also read
» ఆహ్లాదకర జీవితానికి ఏడు సూత్రాలు
» పిల్లలతో ఆధునిక తల్లుల అగచాట్లు!
» అమ్మల అందం అడ్డం అయితే? !
» పిల్లలతో ఎప్పటికి అనకూడని విషయాలు!
» పిల్లల ఆహార వేళలు ఎలా వుండాలి... ?