డెలివరీ సమయంలో నొప్పులు ఎన్ని వున్నప్పటికి, యోని ద్వారా జననం సిజేరియన్ కంటే మంచిది. తల్లిని, బేబీని అది ఆరోగ్యవంతంగా వుంచుతుంది. ఒక సారి సిజేరియన్ అయిన తర్వాత రెండవ డెలివరీ యోనిద్వారా జననం చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చనే చెప్పాలి. అయితే, మీ మొదటి డెలివరీ లో సమస్యలకారణంగా సిజేరియన్ చేస్తే మాత్రం, రెండో సారి మీకు సహజ జననానికి అవకాశాలు తక్కువగా వుంటాయి.
సిజేరియన్ లో మీ గర్భం పై పెట్టిన కోత సమాంతరమైంది అయితే రెండో సారి యోని జననం తేలిక. ఆ కోత కనుక టి ఆకారం లేదా నిలువుగా పెట్టినట్లయితే, రెండో జననం యోనిద్వారా అవటం కష్టం. మీకు గతంలో ఫైబ్రాయిడ్స్ లేదా గర్భసంచి సర్జరీలు లేకుంటే, తప్పక రెండోసారి డెలివరీలో యోని జననానికి ప్రయత్నించండి. మీ గర్భం బొడ్డుతాడు సమస్యలతో కూడుకున్నది కాక సాధారణమైనదిగా వుండాలి అపుడే యోని జననం సాధ్యం.
మీ కటి ప్రదేశం బేబీని డెలివరీ చేయటానికి తగినంత పెద్దదై వుండాలి. మొదటి సారి ప్రయత్నించి ఈ కారణంగా విఫలమైతే, రెండో సారి సూచించదగినది కాదు. ఈ పరిస్ధితిలో మీ గైనకాలజిస్టు తప్పక పరీక్షించి సాధ్యమని సరైన సలహా ఇవ్వాలి. మీ రెండో ప్రెగ్నెన్సీ మొదటి సిజేరియన్ నుండి ఒకటిన్నర సంవత్సరాలలోపు అయినా, గర్భవతి 40 సంవత్సరాల వయసుకి మించి వున్నా, డయాబెటీస్, రక్తపోటు వంటివి వున్న ప్రత్యేక పరిస్ధితిలోను, బేబీ తల అసాధారణంగా పెద్దదిగా వున్నా, మీ ప్రెగ్నెన్సీ 40వ వారంలోకి వచ్చేసి డెలివరీ అవ్వకపోయినా, సహజ యోని జననం కంటే కూడా సిజేరియన్ మంచిది.
» బిడ్డ పుడితే, హాస్పిటల్ డిశ్చార్జి ఎలా?
» తల్లిపాలు అధికం కావాలంటే ? !
» హాని కలిగించే పెయిన్ కిల్లర్ మందులు!

Also read
» పాలుపట్టే మహిళా ఉద్యోగులకు చిట్కాలు!» బిడ్డ పుడితే, హాస్పిటల్ డిశ్చార్జి ఎలా?
» తల్లిపాలు అధికం కావాలంటే ? !
» హాని కలిగించే పెయిన్ కిల్లర్ మందులు!