బొచ్చె చేపల కుర్మా అమోఘం....
Friday, January 13, 2012, 13:46 [IST]
Tasty Fish Kurma
పోషకాల్లో పోటాపోటీ కొరమీనులు, రామలు..సొరచేపలు, చందవాలు, వంజరాలు వేటికవే రుచిలో అమోఘం. కంటి సమస్యలని తొలగించే మిటమిన్ ఎ ఎముకలని బలంగా ఉంచే డి విటమిన్ చేపల్లో సమృద్దిగా ఉంటాయి. ఇందులో కొవ్వు తక్కువ...మాంసకృత్తులు ఎక్కువ. అధిక బరువు సమస్య నుంచి బయట పడాలనుకొనేవారికి చేపలు సరైన ఆహారం వీటిల్లో కెలోరీలు పెద్దగా ఉండవు. బరువును పెంచే కార్బొహైడ్రైట్లు ఇందులో తక్కువ. చేపలు తినడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకొంటుంది.

కావలసిన పదార్థాలు:
బొచ్చె చేప ముక్కలు: 1/2kg
అల్లంవెల్లుల్లి పేస్ట్: 3tbsp
ఉల్లిపాయ: 2
టమాటా ముక్కలు: 1/2cup
పచ్చిమిర్చి: 6-8
కరివేపాకు రెబ్బలు: 2
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
ధనియా పౌడర్: 1tsp
జీలకర్ర: 1tsp
మెంతిపొడి: 1/2tsp
కారం: 4tsp
గరంమసాలా: 1tsp
చింతపండురసం: 3tsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా
నూనె: కావలసినంత

తయారు చేయు విధానము:

1. చేపముక్కలకు ఉప్పు, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద పట్టించి అరగంట నాననివ్వాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడిచేసి చేపముక్కల్ని వేయించాలి.
2. మరో పాన్ లో మిగిలిన నూనె వేడి చేసి ఉల్లిపాయముక్కలు వేయించి మిగిలిన అల్లం వెల్లుల్లిముద్ద, మరికాస్త ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర చేర్చాలి.
3. తర్వాత సన్నగా తరిగిన టమాటాముక్కలు వేసి మొత్తగా అయ్యేదాకా వేయించాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసి అవి మరుగుతుండగా కరివేపాకు, గాటుపెట్టిన పచ్చిమిర్చి వేయాలి.
4. ఇప్పుడు అందులో చింతపండు రసం వేయాలి. ఈ గ్రేవీ మరుగుతున్నప్పుడు వేయించిపెట్టుకున్న చేపముక్కల్ని వేసి కొద్దిగా మెంతిపొడి చల్లాలి. ముక్కలు ఉడికి దగ్గరయ్యాక మసాలపొడి, కొత్తిమీర చల్లిదింపేస్తే సరి. అంతే వేడివేడి చేపలకుర్మా రెడీ.
Also read
» పాలకూర పకోడీ
» కైమా పప్స్
» చికెన్ మసాలా బాల్స్
» బంగాళాదుంపల కట్ ‌లెట్